PDPL: అంతర్గాం మండలంలో వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ సీఈఓ అధికారులను ఆదేశించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో నీటి సమస్య రాకుండా బోర్ల మరమ్మతులు చేపట్టాలని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. BPDP 2025-26 పనులను గడువులోపు పూర్తి చేసి నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.