BHPL: రేగొండ మండలం బాగిర్తిపేట గ్రామంలో నవగ్రహ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చందుపట్ల సత్యపాల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్థానికులతో కలసి ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో శాంతి, సుభిక్షాలు నెలకొని, ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకున్నట్లు తెలిపారు.