KMR: కామారెడ్డి రాజీవ్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు, మందుల లభ్యత, రిజిస్టర్లను స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత పాటించాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూనే, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.