NLR: జిల్లాలోని మనుమ సిద్ది నగర్లో రిత్విక్ ఇన్ఫ్రా సంస్థ సీఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ పనులను కమిషనర్ వైఓ. నందన్ బుధవారం సమీక్షించారు. మంత్రి డాక్టర్ నారాయణ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమీక్షలో పనుల నిర్మాణంపై చర్చించారు. నిర్ణీత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆయన ఆదేశించారు.