AP: కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని జైరాజ్ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్లో పెద్దఎత్తున పేలుడు శబ్దం వినిపించింది. ఈ ఘటనతో ఓర్వకల్లు, గుట్టపాడు పరిసరాల్లో పొగ కమ్ముకుంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.