ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (DCCB) ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన 128వ మహాజన సభ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2025-26 బడ్జెట్ నివేదిక, 2026-27 ప్రతిపాదిత బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని, అలాగే రుణాల రికవరీపై ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు.