HNK: ఉమ్మడి జిల్లాలో ఆధునిక వాతావరణ పర్యవేక్షణ సదుపాయాల్లో ఉన్న లోటుపాట్లను ఎంపీ కడియం కావ్య లోక్సభలో ప్రస్తావించారు. వరంగల్లో ప్రత్యేక వాతావరణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు ముందస్తు చర్యలు, సమగ్ర విపత్తు నిర్వహణ వ్యవస్థలను మరింత పటిష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ కోరారు.