TPT: యుద్ధ ప్రభావం జిల్లాపై గట్టిగానే పడుతోంది. ఇప్పటికే పలుచోట్ల గ్యాస్ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోవడంతో హోటళ్లు మూతపడుతున్నాయి. డొమెస్టిక్ సిలిండర్లు ఆలస్యంగా అందుతున్నాయి. వీటికితోడు వంట నూణెల ధరలకు రెక్కలోస్తున్నాయి. నెల రోజుల్లోనే వివిధ బ్రాండ్ల ఆయిల్ ధరలు రూ.30-40 వరకు పెరిగి రూ.200కు చేరుకుంటున్నాయి. KG బాదంపై రూ. 100,పిస్తాపై రూ.200 మేర ధరలు పెరిగాయి.