BPT: అద్దంకి వద్ద మినీ లారీ బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. టోల్ ప్లాజా సిబ్బంది, అద్దంకి పోలీసులు కలిసి లారీని రోడ్డుపై నుంచి తొలగించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.