VKB: మోమిన్పేట్ మండలం మేకవనంపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బూరుగుపల్లి గ్రామానికి చెందిన నడిమిదొడ్డి ఆగమయ్య అనే రైతుకు చెందిన ఎద్దు పిడుగు పడి మృతి చెందింది. పొలంలో పసుపు దున్నుతుండగా అకస్మాత్తుగా వర్షం కురవడంతో తడవకుండా ఉండేందుకు ఎద్దులను కోటలోకి తీసుకువస్తుండగా పిడుగు పడినట్లు తెలిపారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలి అని కోరారు.