SRD: కేజీబీవీ, యుఆర్ఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 26న నిర్వహించే ‘చలో అసెంబ్లీ’ని జయప్రదం చేయాలని యూటీఎస్ (UTS) జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు పిలుపునిచ్చారు. మల్కాపూర్‌లోని సంఘ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమ్మె కాలపు వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం ఉపాధ్యాయులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.