ADB: గిరిజన సహకార సంస్థ (GCC) ఉట్నూర్ డివిజన్ పరిధిలో 2026-27 ఆర్ధిక సంవత్సరానికి రూ. 176.20 కోట్లతో వార్షిక ప్రణాళిక ప్రతిపాదనలు ఖరారు చేసినట్లు జీసీసీ ఉట్నూర్ డివిజనల్ మేనేజర్ సందీప్ కుమార తెలిపారు. ఈ సందర్భంగా వాటి ఆమోదం కోసం GCC మేనేజింగ్ డైరెక్టర్‌కు పంపిస్తున్నామన్నారు. డివిజన్ పరిధిలో జీసీసీల అభివృద్ధికి అనునిత్యం పాటుపడుతున్నామన్నారు.