E.G: రాజానగరం మండలం వెలుగుబంధ గ్రామంలో ‘మన ఊరు మన ఎమ్మెల్యే మన పల్లె బాట’ కార్యక్రమంలో భాగంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం ఉదయం 9 గంటల నుంచి పర్యటించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో పర్యటిస్తారు. ప్రజలు తమ సమస్యలు తెలియజేస్తే వాటి పరిష్కారానికి ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటారన్నారు.