MBNR: రాజోలి మండల కేంద్రంలోని చాకలి వీధిలో మహిళా సంఘాల సభ్యులకు మహిళల హక్కులు, బాలల సంరక్షణపై అవగాహన కల్పించారు. మహిళాభివృద్ధి, బాలల సంరక్షణ విభాగం ORW లక్ష్మీదేవి మాట్లాడుతూ.. మైనర్ పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, వాటిని అరికట్టాలని సూచించారు. మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.