ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 28 వరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు SP నితిక పంత్ తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. లోక్ అదాలత్ ద్వారా ట్రాఫిక్ చలానాలు, చిన్న క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు వంటి అంశాలను తక్కువ ఖర్చుతో, సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు.