సోషల్ మీడియా దిగ్గజం మెటా.. న్యాయపరమైన చిక్కుల్లో పడింది. అమెరికా న్యూమెక్సికోలో ఒక చారిత్రాత్మక తీర్పులో జ్యూరీ మెటాపై 375 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3,100 కోట్లు) జరిమానా విధించింది. మార్క్ జుకర్బర్గ్ కంపెనీ అయిన మెటా.. లాభాల కోసం పిల్లల భద్రత, మానసిక ఆరోగ్యానికి ఉన్న ప్రమాదాలను దాచిపెట్టి, నిబంధనలను ఉల్లంఘించిందని కోర్టు అంగీకరించి భారీ ఫైన్ వేసినట్లు సమాచారం.