MDK: క్షయ వ్యాధిని సకాలంలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని రేగోడ్ మండల వైద్యాధికారి డాక్టర్ వికాస్ భరోసా ఇచ్చారు. క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 13 మంది బాధితులు ఉన్నట్లు వెల్లడించారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.