దేశ రాజధాని ఢిల్లీలో హోర ప్రమాదం జరిగింది. సెంట్రల్ ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ప్రమాదవశాత్తు డబుల్ డెక్కర్ బస్సు బోల్తా పడి ఇద్దరు మృతిచెందారు. 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. రాజస్థాన్లోని జైపూర్ నుంచి 25 మంది ప్రయాణికులతో వస్తున్న ప్రైవేట్ డబుల్ డెక్కర్ బస్సు.. ఢిల్లీలోని జెండే వాలన్ ఆలయానికి సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది.