NRPT: ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ధన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ రోగులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. బీఆర్పీసీ డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి ఈ కిట్లను అందజేసి, రోగుల్లో మనోధైర్యాన్ని నింపారు. సరైన పోషకాహారం, మందులతో వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.