MDK: పాపన్నపేట మండలం వ్యవసాయ శాఖ కార్యాలయం ఆవరణలో 2025-26 సంవత్సరానికి రాయితీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు రోటోవేటర్, ఆరు తైవాన్ స్ప్రేయర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సతీష్ కుమార్, వ్యవసాయ అధికారి పి. శ్రీనివాస రాజు, ఏఈఓలు, కాంగ్రెస్ నాయకులు పి. ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.