SDPT: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మర్కుక్ మండలం ఎర్రవెల్లిని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని సర్పంచ్ కవిత రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామంలోని దుకాణాదారులతో సమావేశమై, ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గించాలని అవగాహన కల్పించారు. ఇప్పటికే అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిన ఎర్రవెల్లిని, పర్యావరణ పరిరక్షణలో కూడా రాష్ట్రానికే దిక్సూచిగా నిలపడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.