ATP: అనంతపురంలో జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను మూడవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కక్షల నేపథ్యంలో బన్నీ తన స్నేహితులతో కలిసి వంశీకృష్ణపై దాడికి ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో వంశీకృష్ణతో ఉన్న ఆదర్శ్ నాయుడిపై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అరెస్టయిన వారిలో హుమాయూన్, కరుణాకర్ రెడ్డి, రాకేష్, అస్మిత్ చౌదరి, ఉజ్జినప్ప ఉన్నారు.