MDK: చిలిపిచెడ్ మండలం రాందాస్గూడ గ్రామానికి చెందిన అంతారం కిష్టమ్మ అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఆమెకు మంజూరైన రూ. 42,000 విలువైన చెక్కును ఎమ్మెల్యే తన నివాసంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.