AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ అద్దంకి నియోజకవర్గ స్థానిక నేతలతో భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో మరో సమావేశం జరగనుంది. నియోజకవర్గ రాజకీయాల్లో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.