ప్రకాశం జిల్లా పోలీసులు రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో మంగళవారం రాత్రి విస్తృత తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్లు, మెటల్ డిటెక్టర్ల సహాయంతో ప్రయాణికుల లగేజీని పరిశీలించి అనుమానాస్పద వ్యక్తులను గుర్తించారు. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.