TG: వికారాబాద్ జిల్లాలోని స్టీల్ కంపెనీలో పేలుడు సంభవించింది. పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలో ఘటన జరిగింది. ఒక్కసారిగా బట్టీ పేలడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఈ పేలుడులో కార్మికులకు గాయాలైనట్లు సమాచారం. అయితే లారీ టైర్ పేలిందని కంపెనీ యాజమాన్యం తెలిపింది.