ELR: గణపవరంలో శ్రీ సువర్ణేశ్వరస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుక ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సోదరుడు పత్సమట్ల భీమరాజుతో కలిసి ట్రస్ట్ బోర్డ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.