HNK: నగరంలోని పెగడపల్లి డబ్బాల్ అడ్డాలో శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. BRS రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి సైతం కళ్యాణం తిలకించారు. ఈ శుభవేళ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.