కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో చూపు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కళ్లలో మంట, దురద, నీరు కారడం వంటి లక్షణాలు ఇన్ఫెక్షన్లకు సంకేతాలు. కళ్ల ముందు మెరుపులు కనిపించడం రెటినా సమస్యకు దారితీయవచ్చు. వస్తువులు రెండుగా కనిపించడం, రంగులను గుర్తించలేకపోవడం వంటివి జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.