SKLM: గాలి కుంటు వ్యాధి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆమదాలవలస పశు వైద్య అధికారి డాక్టర్ జ్యోత్స్న అన్నారు. శుక్రవారం ఆమదాలవలస మండలం చింతలపేట గ్రామంలో పశువులకు గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వ టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు.