TG: ప్రజలందరికీ హైదరాబాద్ సిటీ పోలీసుల తరఫున కమిషనర్ సజ్జనార్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో జరిగే శ్రీసీతారాములవారి కళ్యాణాలు, శోభాయాత్రలకు నగరవ్యాప్తంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నగరంలో దాదాపు 339 ప్రాంతాల్లో శ్రీరామనవమి సందర్భంగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.