అన్నమయ్య: శ్రీ రామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాల సమర్పణ కోసం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తమ స్వగ్రామం బోరెడ్డిగారిపల్లె నుంచి శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ సీతారాముల ఆశీస్సులు లభించి ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరారు.