KMM: తిరుమలాయపాలెం మండలం పైనంపల్లిలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు మతసామరస్యానికి వేదికయ్యాయి. హిందూ, ముస్లిం సోదరులు ఏకమై గ్రామ ఐక్యతను చాటారు. సర్పంచ్, ఉపసర్పంచ్ దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణం ఘనంగా జరిగింది. అనంతరం గండ్ర గోపాలరావు సౌజన్యంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.