NRPT: నారాయణపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ కొండా శ్వేత సత్య యాదవ్, వైస్ చైర్ పర్సన్ మంజులతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉదయం 5 గంటలకు మున్సిపాలిటీకి చేరుకుని శానిటేషన్ సిబ్బంది హాజరును పరిశీలించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు.