ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే ఆర్సీబీకి గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు బౌలర్ శ్రీలంక ప్లేయర్ నువాన్ తుషారా ఫిట్నెస్ టెస్టులో విఫలయ్యాడు. దీంతో ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు అతనికి NOC నిరాకరించడంతో అతను వెంటనే భారత్ వచ్చే అవకాశం లేదు. అయితే, మరో 4-5 రోజుల్లో నిర్వహించే తదుపరి ఫిట్నెస్ టెస్టులో నెగ్గితేనే తుషారా IPLలో పాల్గొంటాడు.