జమ్మూకాశ్మీర్లో మంచు చరియలు విరిగిపడి ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.