AKP: మునగపాక మండలం వాడ్రాపల్లిలో బుధవారం శ్రీరామనవమి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో చిన్న రామాలయం, పెద్ద రామాలయం వద్ద పెళ్లి రాట మహోత్సవం నిర్వహించారు. ఈనెల 27వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మల్ల వరహా నర్సింగరావు తెలిపారు.