NGKL: అచ్చంపేట పట్టణంలోని సాయినగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఎం.రాములు గుడిసెలో శుక్రవారం మధ్యాహ్నం సిలిండర్ పేలి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుడిసె పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. బాధిత కుటుంబాన్ని రాజకీయ నాయకులు, అధికారులు పరామర్శించి ధైర్యం చెప్పారు.