TG: భువనగిరిలో నాలుగేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి ఘటనపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడి తండ్రికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. చికిత్స ఖర్చు మెుత్తం ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.