శ్రీరామనవమి వేళ సోషల్ మీడియాలో ఓ రాముడి విగ్రహం ఫొటో వైరల్ అవుతోంది. ఆ విగ్రహం అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబు పోలికలతో ఉండటం విశేషం. అయితే APలోని ఓ దేవాలయంలో 15 ఏళ్ల క్రితం నాటి రాముడు అంటూ ఓ నెటిజన్ పెట్టిన ఈ ఫొటోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది నిజమైన విగ్రహమేనా లేక AI సృష్టించినదా అన్న సందేహాలు వస్తున్నాయి. నిజమైతే ఇప్పటికే వెలుగులోకి వచ్చేదని కొందరు అంటున్నారు.