VKB: బంట్వారం మండల కేంద్రంలోని బస్టాండ్ మౌలిక సదుపాయాల లేమితో కొట్టుమిట్టాడుతోంది. నిత్యం వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ బస్టాండ్లో కనీసం మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.