W.G: తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మవారికి శుక్రవారం మధ్యాహ్నం భారీ కుంభన్న నివేదన చేశారు. పులిహోర, బూరెలు, గారెలు, క్షీరాన్నం, ఇతర పిండి వంటలతో అమ్మవారి ప్రతిరూపం చేశారు. అనంతరం అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు కూడా అన్న నివేదన చేశారు.