ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి హెచ్ గ్రామ పంచాయతీ పరిధి దమ్మగూడలో శుక్రవారం ఐకేపీ ఆధ్వర్యంలో (SHG) సంఘాలపై సోషల్ ఆడిట్ నిర్వహించారు. మహిళా సంఘాల పనితీరు, పేదలకు అందుతున్న సేవలపై గ్రామసభలో చర్చించారు. నిరుపేద కుటుంబాలకు తక్షణమే రుణ సౌకర్యం కల్పించాలని సర్పంచ్ చౌహాన్ డిగాంబర్ ఐకేపీ ఏపీఓను కోరారు.