TPT: నాయుడుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన కప్ కేఫ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సినీ నటుడు సత్య ప్రకాష్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సత్య ప్రకాష్ మాట్లాడుతూ.. నాయుడుపేటతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పట్టణ అధ్యక్షుడు రఫీ, జనసేన నేత ఉయ్యాల ప్రవీణ్ తదితరులు హాజరయ్యారు.