కృష్ణా: ఉయ్యూరు కాపుల రామాలయం వద్ద సీతారాముల కళ్యాణ మహోత్సవంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవిబి. రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ధర్మాన్ని నాలుగు పాదాలపై నడిపిన ధర్మమూర్తిగా మనందరం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. తదుపరి కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.