MBNR: దేవరకొండ మండలం బండర్పల్లిలో వెలసిన వేంకటేశ్వరస్వామి వారి 44వ బ్రహ్మోత్సవాలకు రావాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని గ్రామస్థులు ఆహ్వానించారు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే ఈ ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆయనకు మర్యాదపూర్వకంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ అంజి, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.