MLG: ఏటూరునాగారం మండలంలోని రొయ్యూరు గ్రామంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో జిల్లా BRS పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు-శ్రీలత (సర్పంచ్) దంపతులు పాల్గొన్నారు. దేవస్థానంలోని ‘ముత్యాల మండప’ నిర్మాణ పనుల నిమిత్తం లక్ష్మణ్ బాబు రూ.25వేల నగదును ఆలయ కమిటీకి విరాళంగా అందజేశారు. ఆలయ అభివృద్ధికి ఏ సహాయం కావాలన్నా తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.