ATP: రాయదుర్గం మండలం వడ్రవన్నూరులో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదేశాలతో సర్పంచ్ అశోక్ గ్రామ పంచాయతీ నిధులతో బోరు వేయించారు. బోరులో నీరు లభించడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ప్రతి ఇంటికి పైపు లైన్ ద్వారా నీటి కనెక్షన్ అందించనున్నట్లు అధికారులు తెలిపారు.