KRNL: ఎమ్మిగనూరులోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక, బుట్టా శివ నీలకంఠ పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. వేదమంత్రాల నడుమ సంప్రదాయ ఆచారాలతో కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.