WGL: అక్రమ ఇసుక రవాణాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’పేరుతో కొత్త విధానాన్ని తీసుకొస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇసుక రవాణా కేవలం ఆన్లైన్ బుకింగ్ ద్వారానే మాత్రమే అమలు చేయాలని MROలకు ఆదేశాలు జారీ అయ్యాయి. పాత కూపన్ల పద్ధతిని పూర్తిగా రద్దు చేశారు. ఆన్లైన్ రశీదు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.